VKB: ఆరుగాలం కష్టపడి పని చేస్తున్న రైతులకు కోతుల బెడదతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఈ విషయాన్ని పార్లమెంట్లో కూడా చర్చించడం జరిగిందని చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. ఆదివారం వికారాబాద్లో కోతుల బెడద తీర్చేందుకు వాహనాన్ని ప్రారంభించారు. కోతులు బెడద తీవ్రంగా ఉన్న గ్రామాల్లో తిరుగుతూ కోతులను పట్టుకోవడం జరుగుతుందన్నారు.