కరీంనగర్ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలను శాంతియుతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు సీపీ గౌష్ ఆలం పటిష్ట బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు. రెండవ విడత నామినేషన్ కేంద్రాలు, సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లలో భద్రతను తనిఖీ చేశారు. పాత నేరస్తుల బైండోవర్ చర్యలు తీసుకుంటున్నామని, పోలీసులకు సహకరించాలని సీపీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.