సూర్యాపేట సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ ప్రాంగణంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ మంగళవారం ఘనంగా జరిగింది. పాఠశాల విద్యార్థులు, మెప్మా మహిళలు, ఆశావర్కర్లు, జిల్లా అధికారులు పాల్గొని విగ్రహానికి పూలమాలలు సమర్పించారు. అనంతరం “జయ జయహే తెలంగాణ” గీతాన్ని సమూహంగా ఆలపించారు.