KMM: బోనకల్ మండల కేంద్రంలోని బస్టాండ్ సమీపంలోని ఆర్వోబీ బ్రిడ్జి కింద ఉన్న బల్లాపై సుమారు 70 ఏళ్ల గుర్తుతెలియని వృద్ధుడు ఇవాళ మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేశారు. ఈ వృద్ధుడిని ఎవరైనా గుర్తిస్తే వెంటనే బోనకల్ పోలీస్ స్టేషన్ (8712659156)కి సంప్రదించాలని పోలీసులు కోరారు.