KMM: శుభ్రమైన నగరం-ఆరోగ్యమైన ఖమ్మం’ లక్ష్యంగా నగర పాలక సంస్థ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా నిన్న రాత్రి నగరంలోని పలు డివిజన్లలో ముమ్మరంగా ఫాగింగ్ నిర్వహించారు. సీజనల్ వ్యాధుల నియంత్రణకు, దోమల నిర్మూలనకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ప్రజలు కూడా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మున్సిపల్ సిబ్బంది విజ్ఞప్తి చేశారు.