KMM: ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి, వేరొక యువతిని వివాహం చేసుకున్న కేసులో నిందితుడు పొట్ట కృష్ణార్జున రావుకు దమ్మపేట జుడీషియల్ కోర్టు రెండున్నరేళ్ల సాధారణ జైలు శిక్ష విధించింది. ఎస్సై యయాతి రాజు తెలిపిన వివరాలు.. అశ్వారావుపేట మం. బండారిగుంపు గ్రామానికి చెందిన యువతి ఫిర్యాదు మేరకు 2017లో కేసు నమోదైంది.