HNK: భీమదేవరపల్లి మండలం కొత్తకొండ గ్రామంలో కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయం కొలువై ఉంది. రాళ్ల మధ్య ఈ ఆలయం నిర్మించబడి ఉంది. శిలామయమైన ఈ ప్రదేశంలో ఉన్న 5 కొలనులు నిత్యం నీటితో నిండి ఉండటాన్ని స్వామివారి మహత్యంగా ప్రజలు భావిస్తారు. ఇక్కడ ప్రతిఏటా సంక్రాంతి ముందురోజు జాతర జరగుతుంది. సంతానం లేనివారు స్వామివారికి కోరమీసాలు సమర్పించుకుంటే పిల్లలు పుడతారని నమ్మకం.