NLG: నల్లగొండ జిల్లా చండూరు మండల పరిధిలోని బోడంగిపర్తి గ్రామంలో బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి వర్కల సునంద ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఆదివారం ఆమె ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఒకసారి అవకాశం ఇస్తే గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని ఆమె అన్నారు.