వనపర్తి జిల్లాలో మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. ఇవాళ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కముదిని జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పోలింగ్ రోజు, పోలింగ్ తర్వాత చేపట్టాల్సిన ఏర్పాట్లులపై అవగాహన కల్పించారు.