SDPT: దుబ్బాక మండలంలో రెండవ విడత గ్రామ సర్పంచ్ నామినేషన్న దరఖాస్తు చివరి రోజు కావడంతో అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసేందుకు కేంద్రానికి బారులు తీరారు. సర్పంచ్, వార్డ్ మెంబర్ స్థానానికి నామినేషన్ వేయడానికి పెద్ద సంఖ్యలో నామినేషన్ కేంద్రాల వద్ద కనిపించారు. సోమవారం వరకు దుబ్బాక మండలంలోని 21 గ్రామపంచాయతీలకుగాను 67 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు.