MDK: రామాయంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా తరలిస్తున్న మద్యం స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై బాలరాజు తెలిపారు. శనివారం రాత్రి పోలీస్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్న క్రమంలో ఇద్దరు వ్యక్తులు అక్రమంగా మద్యం తరలిస్తుండగా పట్టుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఒక వ్యక్తి నుంచి 147 లీటర్లు, మరో వ్యక్తి నుంచి 288 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.