SRD: నిజాంపేట మండలంలోని ఈదుల్ తండాలో అనారోగ్యంతో బాధపడుతున్న బాధితురాలికి శుక్రవారం స్థానిక ఈదుల్ తండా యూత్ తరఫున ఆర్థిక సాయం అందజేసినట్లు నిర్వాహకులు తెలిపారు. గ్రామానికి చెందిన బుజ్జిబాయి అనారోగ్యంతో పరిస్థితి విషమించి ఐసీయూలో ఉన్నందున తమవంతుగా రూ.17,500 ఆస్పత్రి ఖర్చుల నిమిత్తం వారి కుటుంబ సభ్యులకు అందించినట్లు పేర్కొన్నారు.