MNCL: హాజీపూర్ మండలం దొనబండలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో శుక్రవారం బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని స్వయం పరిపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి పాఠాలు బోధించారు. అనంతరం పాఠశాల హెచ్ఎం కరుణాకర్ మాట్లాడుతూ.. విద్యార్థులకు నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందన్నారు.