జనగామ జిల్లాలో మూడు విడతలుగా జరగబోయే ఎన్నికలు శాంతియుతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని DCP రాజమహేంద్రనాయక్ తెలిపారు. ఈ సందర్భంగా DCP మాట్లాడుతూ.. పంచాయతీ ఎన్నికలు, ఓటర్లను ప్రభావితం చేసేలా మద్యం,డబ్బు పంపిణీపై ప్రత్యేక నిఘా ఉంటుందన్నారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.