ADB: జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘం జిల్లా అధ్యక్షుడిగా ఎల్టీ ఓంప్రకాష్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా అల్లూరి భూపతి రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే ఉపాధ్యక్షులుగా శ్రీకాంత్ రెడ్డి, కేదారేశ్వర రెడ్డి, పద్మ రెడ్డి, కోశాధికారిగా విట్టల్ రెడ్డి ఎన్నికైనట్లు సంఘం ప్రతినిధులు ప్రకటించారు.