NRML: అక్రమ మొరం తవ్వకాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని మండల రెవెన్యూ అధికారులు హెచ్చరించారు. మంగళవారం అక్రమంగా మొరం తవ్వకాలకు పాల్పడుతున్న ఓ లారీని పట్టుకొని తహసీల్దార్ కార్యాలయానికి తీసుకువచ్చారు. లారీలో మొరం లేకపోవడంతో వారిని హెచ్చరించి తిరిగి పంపించారు. అక్రమంగా మొరం రవాణా చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.