NLG: అసెంబ్లీ రౌడీ సినిమాలో జరిగిన ఘటనను తలదన్నే విధంగా తిప్పర్తి మండలంలో సీన్ జరిగిందని, ఈ ఘటనలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాత్ర ఉందని మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం రాత్రి తిప్పర్తి మండలం ఎల్లమ్మ గూడెం గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ నాయకుడు యాదగిరిని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.