SRPT: స్థానిక సంస్థల ఎన్నికల పోరులో నడిగూడెం గ్రామ పంచాయతీలో బీసీ, ఎస్సీ సామాజిక వర్గాల ఓట్లు కీలకం కానున్నాయి. ఈ గ్రామ పంచాయతీ ఎస్సీ రిజర్వేషన్ కాగా, ముగ్గురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. దీంతో అభ్యర్థుల దృష్టి బీసీ సామాజిక వర్గం ఓటర్ల వైపు మళ్లింది. బీసీ ఓటర్లు ఏ అభ్యర్థికి మద్దతిస్తే ఆ అభ్యర్థి విజయం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.