వరంగల్ నగరంలో రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు నిందితులను టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆదివారం పట్టుకున్నారు. వీరి నుంచి సుమారు రూ. 75 వేల విలువ గల 20 క్వింటాళ్ల రేషన్ బియ్యం, ఆటో ట్రాలీని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను తదుపరి విచారణ నిమిత్తం ఇంతేజార్ గంజ్ పోలీసులకు అప్పగించినట్లు ఏసీపీ మధుసూదన్ తెలిపారు.