GDWL: ప్రధానమంత్రి రాష్ట్రీయ బాలశక్తి అవార్డులకు 5 నుంచి 18 ఏళ్ల వయస్సు గల బాలబాలికల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సంక్షేమ అధికారిణి సునంద తెలిపారు. ధైర్యసాహసాలు, సామాజిక సేవ, క్రీడలు, కళలు,రంగాల్లో ప్రతిభ చూపిన వారు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గల చిన్నారులు ఆగస్టు 31లోగా https://awards.gov.in వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవాలి అన్నారు.