NLG: అడవిదేవులపల్లి మండల కేంద్రంలోని ఉల్సాయి పాలెం గ్రామాలలో మంగళవారం మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ప్రతి ఇంటికి కాంగ్రెస్ అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ప్రచారం అనంతరం పార్టీ శ్రేణులతో ఉత్సాహంగా గ్రూప్ ఫోటో దిగారు.