NZB: సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని బాల్కొండ ఎస్సై శైలేందర్ పేర్కొన్నారు. ప్రజలను చైతన్యం చేసేందుకు బాల్కొండ పోలీసులు మంగళవారం ఆయా గ్రామాల్లో విస్తృతస్థాయి అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. అలాగే, బాల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రధాన కూడళ్లు, మార్కెట్ ప్రాంతం, వ్యాపార కేంద్రాల్లో ప్రజలను ప్రత్యక్షంగా కలుస్తూ ఈ ప్రచారాన్ని నిర్వహించారు.