SRD: కంగ్టి రామాలయం నుంచి గ్రామస్తులు కొందరు బుధవారం జుక్కల్ శ్రీ గోవింద మహారాజ్ మఠంకు పాదయాత్రగా వెళ్లారు. కంగ్టి నుంచి 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న జుక్కల్ మఠంలో ఇవాళ గోపాల్ మహారాజ్ శాస్త్రి ఆధ్వర్యంలో జరుగనున్న తుల్సాబాయి అమ్మవారి పుణ్యతిథి కార్యక్రమానికి పాదయాత్రతో వెళ్తున్నామని నిర్వాహకులు గంపలి రాజు, సంతోష్ రెడ్డి, తెలిపారు.