కోనసీమ: చేనేత సహకార సంఘాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని అమలాపురం ఎమ్మెల్యే ఆనందరావు పేర్కొన్నారు. సోమవారం ఉప్పలగుప్తం మండలం విలసవిల్లి గ్రామంలో చేనేత సహకార సంఘ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. కూటమి ప్రభుత్వంలో అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా అందిస్తుంది అని తెలిపారు. కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.