JGL: బీసీ మహిళా నాయకురాలైన బీజేపీ నియోజకవర్గ ఇంఛార్జ్ భోగ శ్రావణిపై చేసిన వ్యాఖ్యలు మానుకోవాలని ఎస్సీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓరగంటి చంద్రశేఖర్ అన్నారు. కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ఆరోపణలకు అర్థం లేదని, రాష్ట్రస్థాయి నాయకురాలిగా శ్రావణి తరచూ హైదరాబాద్కు వెళ్లి రావడం సహజమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు మ్యాదరి అశోక్ పాల్గొన్నారు.