MDK: పోలీసులు సత్వరమే స్పందించి, ఫిర్యాదు అందిన 4గంటల్లోనే పోగొట్టుకున్న బంగారు గొలుసును రికవరీ చేసి బాధితురాలికి అందజేశారు. అల్వాల్‌కు చెందిన ఓ మహిళ గవ్వలపల్లి చౌరస్తాలో కారు దిగుతుండగా బంగారు చైన్ ఉన్న పర్సును పోగొట్టుకుంది. గురువారం మధ్యాహ్నం బాధితురాలు ఫిర్యాదు చేయగా పోలీసులు సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.