SRCL: రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన మొక్కలు నాటే లక్ష్యాన్ని చేరుకోవాలని అధికారులను కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆదేశించారు. వన మహోత్సవంలో భాగంగా జిల్లాలో చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమంపై జిల్లా అటవీ శాఖ అధికారి సత్యనారాయణతో పాటు పలు శాఖల అధికారులతో కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు.