జగిత్యాల కలెక్టరేట్లో జరిగిన జిల్లా దిశా కమిటీ సమావేశంలో నేషనల్ హెల్త్ మిషన్ అమలుపై అధికారులతో కలెక్టర్ సత్య ప్రకాష్ సమీక్షించారు. జిల్లాలో 8 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 16 ఉప కేంద్రాలు పనిచేస్తున్నాయని తెలిపారు. ఆయుష్మాన్ భారత్ పథకంలో 3,48,605 మంది నమోదు కాగా, 100% లక్ష్యాన్ని సాధించినట్లు తెలిపారు. ప్రజలకు వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.