MDCL: యాప్రాల్ కౌకుర్‌లో ఆదివారం కాంగ్రెస్ సీనియర్ నాయకుడు తుడిమెళ్ల మల్లికార్జున ఆధ్వర్యంలో అధికారులతో సమీక్ష జరిగింది. కౌకూర్ నుంచి భారత్ నగర్ వరకు రోడ్ల విస్తరణ కోసం విద్యుత్ స్తంభాల మార్పిడి, డ్రైనేజీ అభివృద్ధి పనులపై చర్చించారు. కౌకూర్ బస్ స్టాప్ జంక్షన్‌ను విద్యుత్ స్తంభాల రహితంగా మార్చి, ట్రాఫిక్ సమస్యలను శాశ్వతంగా తగ్గించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.