నాగర్ కర్నూల్ జిల్లా ఆసుపత్రి సమీపంలో తప్పిపోయి ఏడుస్తున్న చిన్నారిని స్థానికులు, పోలీసులు గుర్తించి బాలల సంరక్షణ అధికారులకు అప్పగించారు. జిల్లా అధికారి శ్రీశైలం, చైల్డ్ హెల్ప్ లైన్ సూపర్వైజర్ నరేష్ వెంటనే విచారణ చేపట్టి తల్లిదండ్రులను గుర్తించి చిన్నారిని క్షేమంగా అప్పగించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ నిరంజన్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.