SRPT: గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి (కోడ్) అమలు కారణంగా ప్రతి సోమవారం జరిగే ‘ప్రజావాణి’ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు. డిసెంబర్ 17 వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని, ఆలోపు ఫిర్యాదులు ఇవ్వడానికి ప్రజలు కలెక్టరేట్‌కు రావద్దని విజ్ఞప్తి చేశారు. కోడ్ ముగిసిన వెంటనే కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుంది.