WNP: గోపాలపేట మండల కేంద్రంలో సుమారు 150 మంది యువకులు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి సమక్షంలో శనివారం బీఆర్ఎస్లో చేరారు. వారికి ఆయన పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. సర్పంచ్ అభ్యర్థి కర్రోల స్వప్నను భారీ మెజారిటీతో గెలిపించాలని యువతకు సూచించారు.