కామారెడ్డిలో నిర్వహించిన జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో పిట్లం ZPHSకు చెందిన శ్రీరామ్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. అండర్-20 బాలుర విభాగం 400 మీటర్ల పరుగు పందెంలో శ్రీరామ్ గోల్డ్ మెడల్ కైవసం చేసుకున్నాడు. ఈనెల 18న ఆదిలాబాద్లో జరగనున్న రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు శ్రీరామ్ ఎంపికైనట్లు పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ సంజీవ్ తెలిపారు.