BDK: స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా సాగేందుకు అన్ని పార్టీల నేతలు సహకరించాలని ఇల్లందు డీఎస్పీ చంద్రభాను సూచించారు. నిన్న ఆళ్లపల్లిలో ప్రజలు, నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో డీఎస్పీ మాట్లాడుతూ.. ఎన్నికల ప్రచారం ముందు పోలీసుల దగ్గర వాహనాల అనుమతి తప్పనిసరి తీసుకోవాలని తెలిపారు. ఎన్నికలు జరిగే 48 గంటల ముందు నుంచి ప్రచారం జరపొద్దని చెప్పారు.