SRD: సిర్గాపూర్ మండలం లక్ష్మణ్ నాయక్ తండాలో ప్రజల తాగునీటి కోసం కొత్త పైపులైన్ అభివృద్ధి పనులను ఆదివారం స్థానిక సర్పంచ్ విఠల్ నాయక్, కాంగ్రెస్ నాయకుడు చంద్రశేఖర్ రెడ్డి కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు. తాగునీటి కోసం వేసిన బోరు నుంచి కొత్త పైప్లైన్ వేసి ట్యాంకుకు కనెక్షన్ ఇచ్చే పనులు చేపడుతున్నట్లు సర్పంచ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఉన్నారు.