MHBD: కొత్తగూడ మండలంలోని చిట్యాలగడ్డ గ్రామంలో గుడుంబా తయారీ స్థావరాలపై ఆదివారం పోలీసులు దాడులు నిర్వహించారు. ఎస్సై రాజ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ దాడుల్లో పెద్దమొత్తంలో గుడుంబా, తయారీ సామగ్రి, డ్రములు, కాస్టిల్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మండలంలో చట్టవ్యతిరేక కార్యకలాపాలను అరికట్టేందుకు పోలీసుల చర్యలు కొనసాగుతాయని తెలిపారు.