HYD: గ్లోబల్ సమ్మిట్ తొలి రోజే రూ. 2.43 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించిన ప్రభుత్వం, ఈ రోజు ఐటీ, ఫిల్మ్, ఫార్మా రంగాలతో కీలక ఎంఓయూలు చేసుకోనుంది. సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ విజన్ డాక్యుమెంట్ విడుదల చేయనున్నారు. అనంతరం 7 గంటలకు రాష్ట్ర అభివృద్ధి, సాంస్కృతిక వైభవాన్ని చూపించే డ్రోన్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.