NRML: జిల్లా అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ శుక్రవారం నిర్మల్ మండలం కొండాపూర్లో పర్యటించారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని అంగన్వాడీ కేంద్రంలో విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి బాలల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అంగన్వాడి కేంద్రాలలో పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించాలని సూచించారు.