JGL: కోరుట్ల పట్టణంలోని అతి పురాతనమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలలో భాగంగా స్వామివారికి 108 రకాల ప్రసాదాలతో నైవేద్యాలు సమర్పించారు. ఆలయ అర్చకులు అభిషేకం తదితర ప్రత్యేక పూజలను నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని మొక్కులు చెల్లించుకొని స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.