MBNR: జిల్లా వ్యాప్తంగా 2,447 గణపతి విగ్రహాలు ప్రతిష్ఠించినట్లు ఆదివారం జిల్లా ఎస్పీ డి. జానకి తెలిపారు. రూరల్ పీఎస్ పరిధిలో అత్యధికంగా 300, మిడ్జిల్ పిఎస్ పరిధిలో అత్యల్పంగా 88 రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. అన్ని వినాయక మండపాల జియో ట్యాగింగ్, నిమజ్జన రూట్ మ్యాప్, సీసీ కెమెరాల పర్యవేక్షణలో బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్పీ పేర్కొన్నారు.