JN: దేవరుప్పుల మండలం లకావాత్ తండా (తూర్పు) గ్రామానికి చెందిన లకావాత్ బిచ్యా నాయక్ శనివారం రాత్రి గుండె పోటుతో ఆకస్మిక మృతి చెందారు. అందరితో సుపరిచితంగా ఉండే ఆయన మృతితో ఉమ్మడి మాదపురం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కాగా ఆయన గతంలో ఉప సర్పంచ్‌గా పనిచేయడంతో పలువురు రాజకీయ నాయకులతో పాటు పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.