HYD: MNJ క్యాన్సర్ ఆస్పత్రి మరో ఘనత సాధించింది. క్యాన్సర్ ఆసుపత్రిలో గత రెండు సంవత్సరాలలో ఏకంగా 400కు పైగా రోబోటిక్ సర్జరీలు పూర్తి చేసినట్లు వెల్లడించారు. రోబోటిక్ సర్జరీల ద్వారా అతి సులువుగా, రోగికి ఇబ్బంది లేకుండా శస్త్ర చికిత్సలు చేస్తున్నట్లుగా వైద్య బృందం వెల్లడించింది. MNJ ఆసుపత్రి క్యాన్సర్ రోగులకు వరంగా మారుతుంది.