BDK: స్థానిక ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు లేదా పోస్టులు పెడితే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అశ్వారావుపేట ఎస్సై యాయాతి రాజు హెచ్చరించారు. ఇతరుల మనోభావాలు దెబ్బతినేలా దుష్ప్రచారం చేసేవారిపై నిఘా ఉంచామన్నారు. అంతేకాకుండా, గ్రామాల్లో బెల్ట్ షాపులు నిర్వహిస్తే సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని అన్నారు.