NGKL: బిజినేపల్లి మండలం మంగనూరు గ్రామానికి చెందిన జినుకుంట కురుమూర్తి గత నాలుగేళ్లుగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నాడు. అతని పరిస్థితిని గమనించిన తోటి స్నేహితులు స్పందించి మొత్తం రూ.17,000 ఆర్థిక సహాయం ఆదివారం అందజేశారు. కురుమూర్తి నడవలేని స్థితిలో ఉండటంతో అతనికి సహాయం అందించిన స్నేహితులను గ్రామ ప్రజలు అభినందించారు.