కరీంనగర్: గంగాధర మండలం ఓద్యారం వద్ద ఘోర ప్రమాదం జరిగింది. వేములవాడ రాజన్న దర్శనం ముగించుకుని వరంగల్ వెళ్తుండగా ఓ కుటుంబం ప్రయాణిస్తున్న కారు డివైడర్ను ఢీకొట్టి పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు బాధితులను కారులో నుంచి బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. మిగిలిన వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.