మహబూబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలోని పార్వతమ్మ గూడెం గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానం జనరల్ మహిళా రిజర్వేషన్‌కు కేటాయించగా, కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ఎదల్ల పూలమ్మ ఏకగ్రీవంగా సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. బుధవారం అధికారులు దీనిని అధికారికంగా ప్రకటించనున్నారు. గ్రామ ప్రజలు ఈ ఏకగ్రీవానికి ఆనందం వ్యక్తం చేస్తూ పూలమ్మకు శుభాకాంక్షలు తెలిపారు.