MBNR: బాలానగర్ మండలంలోని పెద్ద రేవల్లి గ్రామంలో బుధవారం రాత్రి జడ్చర్ల సీఐ నాగార్జున సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసి వ్యక్తిగత వివరాలు అడిగితే చెప్పకూడదని, ఏపీకే ఫైల్స్ ఓపెన్ చేయకూడదన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై లెనిన్ ఎస్సై గోపాల్ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.