BDK: మణుగూరు మండలం సమితి సింగారం రిక్షా కాలనీ ప్రాంతానికి చెందిన బత్తిని రాజేశ్వరి 45 సంవత్సరాలు క్యాన్సర్ వ్యాధితో ఇవాళ మరణించారు. విషయం తెలుసుకున్న మేము సైతం మిత్రమండలి చారిటబుల్ ట్రస్ట్ స్పందించి ట్రస్ట్ ద్వారా బత్తిని రాజేశ్వరి కుటుంబ సభ్యులకు దహన సంస్కరాల కోసం ఆర్థిక సహాయం అందజేశారు. మిత్రమండలి ట్రస్ట్ వారు మంచి కార్యక్రమాలు చేస్తున్నారని స్థానికులు కొనియాడుతున్నారు.