BDK: వరి పొలాల్లో మంట కారణంగా ఓ రైతు వడ్లు కాలి బూడిద అయిన ఘటన శనివారం గుండాల మండలంలోని లింగగూడెం గ్రామంలో జరిగింది. గ్రామంలోని కుంజ దశరథం అనే రైతుకు చెందిన వడ్లు పొలాల్లోని వేస్ట్ వరి గడ్డికి పెట్టిన మంట కారణంగా కాలి బూడిద అయ్యాయి. అందుకు కారకులైన వారి పైన కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.