MDCL: ఆనంద్ బాగ్ ప్రాంతంలోని వెంకటేశ్వర టెంపుల్ ఏరియాలో అనుమతులకు విరుద్ధంగా నిర్మాణాలు కొనసాగుతున్నప్పటికీ టౌన్ ప్లానింగ్ అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని స్థానికులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. పలుమార్లు కిందిస్థాయిలో ఫిర్యాదు చేసిన ఫలితం లేదని, ఇకనైనా స్పందించి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.